ప్రియాంక ప్రత్యేక పూజలు
Published on: Sat May 13, 2023 2:03PM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుకొంటోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో ఊరు వాడా.. నేతలు, కార్యకర్తలతో సంబరాలు మిన్నంటాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ.. హిమాచల్ ప్రదేశ రాజధాని సిమ్లాలో జఖూలోని హనుమాన్ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశంతోపాటు కర్ణాటక రాష్ట్రంలో శాంతి, శ్రేయస్సుల కోసం ఆమె ప్రార్థనలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గంట వ్యవధిలోనే సగం స్థానాల మార్కును సునాయాసంగా హస్తం పార్టీ దాటేసింది. మరోవైపు మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలకు పైగా కైవసం చేసుకొంటుందని ప్రియాంక గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.


