వయనాడ్ నుంచి ప్రియాంక నామినేషన్
Published on: Wed Oct 23, 2024 4:06PM
వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గం గాంధీ కుటుంబానికి ప్రతిష్టాత్మకం గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి రాయబరేలి నుంచి కూడా గెలుపొందిన రాహుల్ గాంధీ వయనాడ్ వదులుకున్నారు గాంధీ కుటుంబం నుంచి ప్రియాంకగాంధీకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు భర్త రాబర్ట్ వద్రా, పిల్లలు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లి ఖార్జున్ ఖర్గేతో బాటు పలువురు హాజరయ్యారు
.నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రియాంక రోడ్ షో నిర్వహించారు. వయనాడ్ బిజెపి అభ్యర్థిగా నవ్య పోటీ చేస్తున్నారు


