TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోనియా ఆత్మకథ ప్రియాంక రాస్తుందట!

Published on: Sat Aug 2, 2014 3:02PM

 

మాజీ మంత్రి నట్వర్ సింగ్ తన ఆత్మకథలో సోనియా గాంధీ కుటుంబం మీద బోలెడన్ని సంచలన విషయాలు వెల్లడించడంతో హర్టయిపోయిన సోనియాగాంధీ తాను కూడా ఆత్మకథ రాస్తానని.. అందులో అనేక నిజాలను బయటపెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోనియా ఏదో ఆవేశంలో అనేసిందిగానీ, సోనియా ఆత్మకథ రాసేది సోనియా గాంధీ కాదట.. సోనియాగాంధీ చెబుతూ వుంటే ఆమె కుమార్తె ప్రియాంక రాస్తుందట. ఇది ఓ జాతీయ దినపత్రిక వెల్లడించిన విషయం. సోనియాగాంధీ ఆత్మకథ ఎవరో బయటివాళ్ళు కాకుండా ప్రియాంక రాస్తేనే మంచిది. ఎందుకంటే ఆత్మకథ చెప్పే ఆవేశంలో సోనియా గాంధీ కొన్ని నిజాలను బయటపెట్టేస్తే బయటవారైతే డేంజర్. అదే ప్రియాంక అయితే అమ్మ చెప్పే నిజాలకు పాలిష్ చేసి తమ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా కవర్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికి అనేక సందర్భాలలో ప్రియాంక తన తల్లిని, తమ్ముడిని కవర్ చేసుకుంటూ వచ్చింది కదా! ఇదిలా వుంటే, సోనియా గాంధీ తన ఆత్మకథ రాస్తానన్న వ్యాఖ్యలపై నట్వర్ సింగ్ స్పందించారు. సోనియా నిర్ణయం సంతోషకరమన్నారు. ఆ ఆత్మకథ కోసం తాను ఎదురు చూస్తుంటానన్నారు.