TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రియాంకాగాంధీని రెచ్చగొట్టిన బీజేపీ కార్యకర్తలు.. కారు దిగి??

Published on: Tue May 14, 2019 3:41PM

 

ఒక నేత ఎదురుగా మరో నేత పేరుతో కార్యకర్తలు నినాదాలు చేస్తూ రెచ్చగొడితే ఎలా ఉంటుంది?. మధ్యప్రదేశ్ లో ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీకి అలాంటి విచిత్రమైన అనుభవమే ఎదురైంది. ప్రియాంక కారులో వెళుతుండగా బీజేపీ కార్యకర్తలు 'మోదీ.. మోదీ' అని గట్టిగా అరుస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రియాంక మాత్రం హుందాగా ప్రవర్తించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళుతున్నారు. ఆమె కాన్వాయ్ వెళ్లే మార్గంలో కొందరు బీజేపీ కార్యకర్తలు గుమిగూడారు. ప్రియాంక అటుగా రాగానే ‘మోదీ.. మోదీ’ అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన ప్రియాంక సెక్యూరిటీ సిబ్బంది సాయంతో కారు దిగారు. దీంతో బీజేపీ కార్యకర్తలతో ప్రియాంక గొడవ పెట్టుకుంటారేమోనని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ప్రియాంక నవ్వుతూ వెళ్లి బీజేపీ కార్యకర్తలను పలకరించారు. వారితో కరచాలనం చేశారు. ప్రియాంక వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటే బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవ అయ్యుండేదని.. కానీ ప్రియాంక సహనంతో వ్యవహరించారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.