TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రియాంకా గాంధీకి కరోనా.. హోం క్వారంటైన్ లో కాంగ్రెస్ నాయకురాలు

Published on: Wed Aug 10, 2022 12:34PM

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనా సోకిందనీ, స్వల్ప లక్షణాలు ఉన్నాయనీ, హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాననీ ఆమె ట్వీట్ చేశారు.

కాగా ప్రియాంక గాంధీకి కరోనా సోకడం రెండు నెలల వ్యవధిలో ఇది రెండో సారి. కొద్ది రోజుల కిందట ఆమె తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సోనియాగాంధీ అప్పట్లో కొద్ది రోజులు ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ఇలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా అనారోగ్యం పాలయ్యారు. అయితే ఆయనకు కరోనా కాదని చెబుతున్నారు.

స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనారోగ్యం కారణంగా బుధవారం (ఆగస్టు10) ఆయన రాజస్థాన్ పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం రాజస్థాన్ లోని అల్వార్ లో పర్యటించాల్సి ఉండగా అది రద్దైంది.