TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రియాంక గాంధీ ఎంట్రీ.. మోడీపై పోటీకి రెడీ.!!

Published on: Wed Jul 25, 2018 11:02AM

2014 ఎన్నికల ఫలితాల తరువాత అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా అనే అనుమానం ఇంచుమించు అందరిలో వ్యక్తమైంది.. ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ సుమారు నాలుగేళ్లు తరువాత కాంగ్రెస్ పుంజుకోవడం మొదలుపెట్టింది.. బీజేపీకి మిత్రపక్షాలు దూరమవ్వడం, ప్రజల్లో వ్యతిరేకత మొదలవ్వడం.. రీసెంట్ గా లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా రాహుల్ గాంధీ స్పీచ్ అదరగొట్టేయడం.. ఇలా ఒకదాని తరువాత ఒకటి కాంగ్రెస్ కి కలిసొస్తున్నాయి.. అయితే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.. అదే, 2019 ఎన్నికల్లో ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్నారట.

 

 

పోలికల్లో అచ్చు నాయనమ్మ ఇందిరా గాంధీలా ఉండే ప్రియాంక, రాజకీయాల్లో ఇందిరా లాగానే రాణిస్తుందని కాంగ్రెస్ కార్యకర్తల నమ్మకం.. ఆ నమ్మకంతోనే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తలు ఎప్పటినుండో కోరుతున్నారు.. ప్రియాంక కూడా ఇదే మంచి సమయం అని భావించి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారట.. 2019 ఎన్నికల్లో రాయ్ బరేలీ లేదా వారణాసి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని చూస్తున్నారట.. వారణాసిలో మోడీని ఓడించి తన రాజకీయ అరంగేట్రంతోనే, బీజేపీకి అదిరిపోయే పంచ్ ఇవ్వాలనుకుంటున్నారట.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.