ఓరి నాయనో...7నిముషాలకు 6 కోట్లంట
Published on: Tue Dec 17, 2013 9:47AM

"ఏ దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు" అన్నట్లుగా... సినిమా ఛాన్సులు రాని హీరోయిన్లకు స్టేజ్ షో డాన్సులే దిక్కయ్యాయి. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ల దృష్టి మొత్తం కూడా డిసెంబర్ 31 నైట్ పైనే ఉంది. ఎందుకంటే సినిమా ఛాన్సులు ఎప్పుడస్తాయో తెలియట్లేదు అందుకే అలాంటి వారికీ ఇదొక బంపర్ ఆఫర్ లా దొరికింది. దీంతో తమకు కాస్త డబ్బులు కూడా వస్తాయని ఆశిస్తున్న ఈ హీరోయిన్ల ఆశలపై స్టార్ హీరోయిన్లు నీళ్ళు చల్లుతున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ స్టార్ హీరోయిన్లు డిసెంబర్ 31 నైట్ కు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా తన రేటుని ఫిక్స్ చేసేసింది. డిసెంబర్ 31 రోజున కేవలం 7నిముషాలు మాత్రమే పాల్గొనడానికి అక్షరాల 6కోట్ల రూపాయలను డిమాండ్ చేసింది. ఈ అమ్మడు అడిగినంత పారితోషకాన్ని కూడా ఇవ్వడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు.
మరి ఇలా నిమిషాలకే కోట్ల రూపాయలను మింగేస్తుంటే... వీరు సినిమాలు చేయడం మానేసి, ఇలాంటివే ఒక పది రోజులకు ఒప్పుకుంటే... ఈ హీరోయిన్లే ప్రపంచంలోని అత్యంత ధనవంతులుగా మారిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. పాపం వీళ్ళ తాకిడికి చిన్న హీరోయిన్లు ఎలా తట్టుకుంటారో ఏమో.


