‘మేరికోమ్’ మూవీ రివ్యూ

 

నటీనటులు: ప్రియాంక చోప్రా, దర్శన్ కుమార్, సునీల్ థాపా, మీనాక్షి కలితా, శిశిర్ శర్మ, సంగీతం: శశి-శివమ్ , ఫోటోగ్రఫీ: కీకో నకహర, నిర్మాత: వయాకామ్ 18 మోషన్ పిక్చర్, డైరెక్టర్: ఒమంగ్ కుమార్ , క్రియేటివ్ డైరెక్టర్: సంజయ్ లీలా భన్సాలీ.

 

ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటించగా రూపొందిన క్రీడా నేపథ్యంతో రూపొందిన సినిమా ‘మేరి కోమ్’ ఈశాన్య భారతదేశంలోని ఓ కుగ్రామంలోని పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మేరి కోమ్ అనే యువతి తనకు ఎదురైన అన్ని అడ్డంకులు జయించి బాక్సింగ్ క్రీడలో అంతర్జాతీయ ఛాంపియన్ గా మేరి కోమ్ ఎలా మారింది. అలాగే పెళ్ళయ్యాక కూడా తర్వాత మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దూకి, క్రీడా సంస్థల అవమానాలను, అనేక ఆటుపోట్లను అధిగమించి.. విమర్శకులకు ఎలాంటి సమాధానమిచ్చిందనే కథాంశమే మేరి కోమ్ చిత్రం. అనేక కష్టాలను ఎదురించి అంతర్జాతీయ క్రీడాకారిణిగా మారిన ఓ సామాన్య యువతి పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించింది. ప్రశంసనీయమైన నటన ప్రదర్శించింది. తొలిసారి దర్శకత్వం వహించిన ఒమాంగ్ కుమార్ ‘మేరి కోమ్’ సినిమాని ప్రశంసనీయంగానే తెరకెక్కించాడు.