TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కంటతడి పెట్టిన శిల్పాశెట్టి

Published on: Mon Sep 8, 2014 8:09PM

 

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కంటతడి పెట్టింది. దానికి కారణం మరెవరో కాదు.. మరో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. అయితే ప్రియాంక చోప్రా నటించిన ‘మేరి కోమ్’ చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనైన శిల్పాశెట్టి కంటతడి పెట్టిందే తప్ప మరో కారణం కాదు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘మేరి కోమ్’ చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలైంది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి మేరి కోమ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మేరి కోమ్ పాత్రను ప్రియాంకా చోప్రా ధరించింది. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన శిల్పాశెట్టి ప్రియాంక నటనను చూసి కంటతడి పెట్టానని ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ‘‘మేరి కోమ్ సినిమా చూశాను. ప్రియాంక బాగా నటించింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం బాగుంది. ఈ చిత్రాన్ని చూసి కంట తడి పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం ఇది’’ అని శిల్ప ట్వీట్ చేసింది.