TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రియమణి..ఆయనకి మాత్రం ఫ్రీ

Published on: Tue Jun 18, 2013 6:22PM

 

Priyamani Item Song,Priyamani Shahrukh, Shahrukh Priyamani Item Song

 

 

అందాల సుందరి ప్రియమణి బాలీవుడ్ కి రెండు సార్లు వెళ్ళిన అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈ సారి వచ్చిన ఆఫర్ ను బాగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో ఐటెంసాంగ్ చేసింది ప్రియమణి. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం కంపోజ్ చేసిన స్టెప్స్ కి అదరహో అనే విధంగా డ్యాన్స్ వేసిందట. ఇక్కడ మరో విశేషమేమిటంటే ...ఈ అమ్మడు ఈ పాట కోసం నయా పైసా కూడా తీసుకోలేదట. షారూఖ్ సరసన అవకాశం రావడం అంటేనే గొప్ప. ఆయన పై ఉన్న అభిమానం, గౌరవంతో ఈ సాంగు ఫ్రీగా చేశానని చెప్పుకొచ్చింది. అయితే ప్రియమణి ఫ్రీగా చేయడం వెనక వున్న ప్లాన్ ఏమిటో తమకు తెలుసునని ఆడియన్స్ అంటున్నారు!