TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోర్టులో గొంతు కోసుకున్న ఖైదీ

Published on: Tue Sep 16, 2014 4:34PM

 

విచారణలో వున్న ఓ ఖైదీ కోర్టులోనే గొంతు కోసుకుని పోలీసుల చేత పరుగులు పెట్టించాడు. ఓ నేరం మీద రాజమండ్రి జైల్లో వున్న రాజశేఖర్ అనే ఖైదీని పోలీసులు విచారణ నిమిత్తం మంగళవారం కృష్ణాజిల్లా అవనిగడ్డలోని కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు విచారణ జరుగుతూ వుండగా ఖైదీ రాజశేఖర్ ఎక్కడి నుంచో ఓ పదునైన వస్తువుని సంపాదించి దాంతో కోర్టు ఆవరణలోనే తన గొంతు కోసుకున్నాడు. ఈ సంఘటనతో బిత్తరపోయిన పోలీసులు రాజశేఖర్‌ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్ళారు.