ప్రిన్స్ చార్లెస్ కు కరోనా నుంచి విముక్తి

 

* బెంగళూరు డాక్టర్ ప్రయత్నం సఫలం

* వెల్లడించిన కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్
* ప్రత్యామ్నాయ వైద్య విధానం తో కరోనా ను దారిలో పెట్టొచ్చు
* డాక్టర్ మతాయ్ ఫార్ములాపై అధ్యయనానికి ఆయుష్ స్పెషల్ టాస్క్ ఫోర్స్

ఎవరన్నారు, ఆయుర్వేదం, హోమియోపతిలతో కరోనా క్యూర్ కాదని!! బేజానుగా క్యూర్ చేయొచ్చునని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ చెపుతున్నారు. బ్రిటన్ రాజవంశీకుడు ప్రిన్స్ చార్లెస్ కు బెంగళూరు కు చెందిన ఒక ప్రకృతి ఆశ్రమ నిర్వాహకుడు డాక్టర్ మతాయ్ కరోనా ను నయం చేసి చూపించాడని, ఇది ప్రత్యామ్నాయ వైద్య విధానం ద్వారానే సాధ్యమైందని శ్రీపాద నాయక్ వివరించారు. నెలకు పైగా కరోనా బారిన పది చికిత్స పొందుతున్న ప్రిన్స్ చార్లెస్, డాక్టర్ మతాయ్ సూచించిన ప్రత్యామ్నాయ వైద్య విధానం ద్వారా, ఆయుర్వేదం, హోమియోపతి సాయంతో ప్రస్తుతం కరోనా నుంచి ఉపశమనం పొందారని శ్రీపాద నాయక్ సువివరించారు.

డాక్టర్ మతాయ్ బెంగళూరు లో 30 ఎకరాల ఆర్గానిక్ ఫార్మ్ లో నిర్వహిస్తున్న ప్రకృతి ఆశ్రమం ప్రత్యామ్నాయ వైద్య విధానం మీద విస్తారం గా పరిశోధన చేస్తోందని, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న ప్రిన్స్ చార్లెస్ కు ఈ వైద్య విధానం ద్వారా డాక్టర్ మతాయ్ కరోనా నుంచి విముక్తం చేశారని శ్రీపాద నాయక్ చెప్పారు. కరోనా ను క్యూర్ చేయటానికి డాక్టర్ మతాయ్ రూపొందించిన ఈ ఫార్ములా ను అధ్యయనం చేయటానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని  కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద నాయక్ చెప్పారు.