మోడీజీ ఆ 100 రూపాయలు ఏమైనట్లు..?

ఎన్డీయే హయాంలో ధరల పెరుగుదలపై లోక్‌సభలో రాహుల్ చేలరేగిపోయారు. ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. పలు ఆహార ధాన్యాల ధరలను, ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్యాక్సులను ప్రస్తావించారు. రైతుల నుంచి ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మొత్తం దోచుకుంటోందీ వివరించారు.

 

యూపీఏ హయాంలో పప్పు ధరలో మార్కెట్ రేట్‌కి, రైతుల నుంచి కొనుగోలు రేటుకీ మధ్య కేవలం 30 రూపాయల వ్యత్యాసం ఉండేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యత్యాసం 130 రూపాయలకు పెరిగిందని అన్నారు. ఆ 100 రూపాయలు ఎవరు తింటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారం రోజున ప్రధానిగా కాకుండా..సేవకుడిగా ఉండాలనుకుంటున్నానని ప్రకటించిన మోడీగారు, ప్రజలకు ప్రధానంగా రైతులకు చెందిన భూములను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు మూడు సార్లు సవరణకు ప్రతిపాదించారని రాహుల్ ఆరోపించారు. మరీ ప్రధాని దేశానికి సేవ చేస్తున్నారా..? లేక పెట్టుబడిదారులకు సేవలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.