కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధాని నరేంద్రమోడీ
Published on: Tue Aug 12, 2014 2:23PM

భారత ప్రధాని నరేంద్రమోడీ కార్గిల్‌ని మంగళవారం నాడు సందర్శించారు. పాకిస్థాన్ దురాక్రమణకు ప్రయత్నించినప్పుడు కార్గిల్ ప్రజలు ఎంతో దేశభక్తిని ప్రదర్శించి పాకిస్థాన్ సైనికులు, తీవ్రవాదులను తిప్పికొట్టారని మోడీ అన్నారు. కార్గిల్ ప్రజల దేశభక్తిని చూసి దేశం గర్విస్తోందని మోడీ చెప్పారు. జమ్ము కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆయన కార్గిల్‌లో ఏర్పాటు చేసిన 44 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. లెహ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, భారత్‌ని ముఖాముఖి ఎదుర్కొనే శక్తి లేకనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. కార్గిల్‌తో ఇతర ప్రాంతాల సంబంధాలు మెరుగుపరుస్తామని, కార్గిల్‌లో పారిశ్రామిక ప్రగతి సాధిస్తామని, రక్షణ బలగాలను సాంకేతికంగా బలోపేతం చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. తాను బీజేపీ కార్యకర్తగా వున్న సమయంలో కూడా తాను కార్గిల్‌ని సందర్శించానని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.


