నేడు మోడీ పుట్టినరోజు... తల్లి ఆశీస్సులు...
Published on: Wed Sep 17, 2014 9:22AM
.jpg)
నేడు భారత ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు. నరేంద్రమోడీ 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నరేంద్రమోడీ తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకోవడానికి గుజరాత్‌లోని గాంధీనగర్‌కి వెళ్ళారు. అక్కడ ఆమె పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా హీరాబెన్ తాను నరేంద్రమోడీ పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా చేయించిన మోడీకి ఇష్టమైన మిఠాయిని మోడీకి తినిపించారు. అలాగే ఆమె మోడీకి ఒక దండను కూడా కానుకగా ఇచ్చారు. మోడీ నుదుటన ఆమె ముద్దు పెట్టారు. ఈ సందర్భంగా మోడీ తన తల్లి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదిలా వుంటే, నరేంద్రమోడీ పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతాపార్టీ వర్గాలు భావించాయి. అయితే నరేంద్రమోడీ వాటిని వారించారు. తన పుట్టినరోజు వేడుకలు జరిపేకంటే, వరద కష్టాల్లో వున్న కాశ్మీర్ వాసులను ఆదుకుంటే సంతోషిస్తానని అన్నారు.


