జపాన్ నుంచి తిరిగి వచ్చిన మోడీ
Published on: Wed Sep 3, 2014 3:34PM
.jpg)
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన నాలుగు రోజుల జపాన్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి బుధవారం తిరిగి వచ్చారు. ఆయన శనివారం జపాన్‌కి బయల్దేరి వెళ్ళారు. యుపిఎ ప్రభుత్వ 10 ఏళ్ళ హయాంలో జపాన్‌తో భారత సంబంధాలు పూర్తిగా సన్నగిల్లాయి. వాటిని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతంతో పాటు అతిథి సత్కారాలు కూడా లభించాయి. జపాన్ వెళ్ళేముందు మోడీ జపనీస్ భాషలో ట్వీట్లు చేయడంతో ఆయనకు జపనీయులు మరింత దగ్గరయ్యారు. జపాన్‌లోని క్యోటో, టోక్యో నగరాలను ఆయన సందర్శించారు. పురాతన దేవాలయాన్ని, పురాతన విద్యాలయాన్ని సందర్శించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారతదేశానికి పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపనీయులను ఆహ్వానించారు. మొత్తమ్మీద ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన ఫలప్రదమైంది.


