సంక్రాంతి పండుగ పూట...గోసేవలో ప్రధాని మోదీ
Published on: Thu Jan 15, 2026 9:47AM
.webp)
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గోవులకు మేత తినిపించి ప్రధాని మోదీ భక్తిని చాటుకున్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్. మురుగల్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ఆయన, అక్కడ ఆవులకు స్వయంగా దాణా అందించారు. ప్రకృతిని పశువులను గౌరవించి భారతీయ సంస్కృతిని ఈ చర్యకు నిదర్శమని ఆయన పేర్కొన్నారు. మోదీ గత కొంత కాలంగా తన నివాసంలో పుంగనూరు జాతి ఆవులను పెంచుతున్నారు.ఈ సందర్భంగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.


