అయ్యో ఏ కైసే హోగయా మోదీ జీ
Published on: Fri Jan 22, 2016 3:36PM

మన ప్రధానమంత్రి గారు ఈ మధ్య బాగా డల్ అయిపోయారండీ.. ఎందుకంటే.. 56 ఇంచులున్న ఆయన చెస్ట్ సైజు ఇప్పుడు 50 ఇంచులకు పడిపోయిందట. వామ్మో ఎంత డేంజరో కదా.. హెల్త్ ప్రాబ్లమ్ ఏమీ లేదంట. కంగారు పడాల్సిందేమీ లేదు. అయినా ఒక్కసారిగా అంత తగ్గిపోతే.. ఇంకేమైనా ఉందా.. పాపం. మోదీజీ ఏ కైసే హోగయా జీ అని.. ఆయన ఫ్రెండ్సంతా గుడ్డుపై ఈకలు పీకినట్టు.. లాజిక్కులు అడుగుతున్నారంట.. ఎన్నికలప్పుడు ఫుల్ జోష్‌తో ఉన్న నరేంద్రుడు.. ఆ తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. మెల్లగా మోడీకి రాష్ట్రాల ఎన్నికల వేడి తగలడం మొదలయ్యాక ఇలా ఇంచులకొద్దీ కరిగిపోతున్నారు పాపం.. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ క్రేజీగా గెలిచేశారు.. దేశ రాజధానిలో విచ్చుకోవాల్సిన కమలం పువ్వు కకావికలమయ్యేసరికి.. సార్ చెస్టు, ఠపీమని ఒక ఇంచు తగ్గిపోయిందట.
ఆ తర్వాత బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యేసరికి.. ఆయన మరింత కుంగిపోయారట. దాంతో ఇంకో ఇంచు కూడా సారీ చెప్పేసి సెలవు తీసుకుందట. ఇలా వన్ బై వన్ ఇన్సిడెంట్లు జరగడం.. ఇంచ్ బై ఇంచ్ కరిగిపోవడం.. మోదీ గారికి చాలా బాధ కలిగిస్తోంది.. ఏం చేద్దాం.. వీటితో పాటు పాక్ ప్రెసిడెంట్ నవాజ్ షరీఫ్‌తో భేటీ, పఠాన్ కోట్ ఎపిసోడ్ ఆయన బాడీపై వెయిట్ పెంచాయంట. ఇలా ఒక్కో ఇన్సిడెంట్తో ఒక్కో ఇంచ్ తగ్గుకూ 56 నుంచి 50 ఇంచులకు చెస్ట్ సైజు పడిపోయింది. అయినా మోదీ గారిని ఇంత బాగా వాచ్ చేస్తున్నది ఎవరో తెలుసా.. ఇంకెవరు.. క్లాసికల్ మహారాజా ఆఫ్ కాంగ్రెస్ పార్టీ.. మిస్టర్ రాహుల్ గాంధీయే.. ఆయన చెస్ట్ సైజును బాగా అబ్జర్వ్ చేసి.. ఇలా అనలైజ్ చేశారు మరి.. రాహుల్ జీ మీరెంత గొప్ప మాస్టరో.. ఇంకా పార్లమెంటులో ల్యాండ్ అక్విజైషన్ బిల్లు కూడా పాస్ కాలేదు.. ఈ బిల్లు కావాలంటే..మామూలు విషయమా అప్పుడే ఏమైంది.. ఇన్ ఫ్రంటాఫ్ క్రోకొడైల్ ఫెస్టివల్ అని రాహుల్ మోదీ ఛాతీపై కూర్చుని కొలతలేస్తున్నట్టున్నారు.
రాబోయే పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీటైతే.. మోదీ చెస్ట్.. 50 ఇంచుల నుంచి 5.6 ఇంచులకు పడిపోతుందని. కావాలంటే మీరే చూడండని రాహుల్ జీ భలే ఖుషీగా చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రాహుల్ చేసిన ఈ కామెంట్లో షికారు చేస్తున్నాయి.. ఏమైనా రాహుల్‌లో కూడా మాంచి కమెడియన్ ఉన్నాడు.


