సూరి బతికుంటే వంశీ ఎక్కడుండేవాడు?
Published on: Fri May 11, 2012 6:04AM
పరిటాల రవి హత్యకేసులో మద్దెలచెర్వు సూరి ప్రధాన నిందుతుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ పరిటాల రవి అనుచరుడు. మద్దెలచేరవు సూరిని హత్యచేసిన భాను కిరణ్ తో వంశీ టచ్ లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాక వంశీ అత్యుత్సాహంతో మద్దెలచెర్వు సూరి వ్యవహారాల్లో తల దూర్చాదన్న విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సూరి, వంశీని టార్గెట్ చేయడానికి ప్రయత్నించాడని భాను పోలీస్ ఇంటరాగేషన్ లో చెప్పినట్లు తెలిసింది.
ఇక అసలు విషయానికి వస్తే మద్దెలచెర్వు సూరి జైలునుంచి విడుదలైన తర్వాత కూకట్ పల్లిలోని తన ప్రియురాలి ఇంటికి తరచుగా వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న వంశీ ఆమె ద్వారా సూరి ఆనుపానులు తెలుసుకోవడానికి ప్రయత్నించాడని తెలిసింది. అయితే ఆ ప్రియురాలు ఈ విషయాన్ని సూరికి చెప్పడంతో అతను అగ్గిమీద గుగ్గిలమై వంశీని టార్గెట్ గా పెట్టుకున్నాడు. వంశీకి బద్దవిరోధి అయిన విజయవాడ నగరానికి చెందిన ఒక నేత సోదరుడితో సూరి సమావేశంయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న వంశీ తనను హత్యచేయడానికి కొందరు కుట్రపన్నుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇది జరిగిన కొద్దికాలానికే సూరి హత్య జరగంతో వంశీ హాయిగా ఊపిరి పీల్చుకున్నట్లు తెలిసింది. ఒకవేళ సూరి బ్రతికుంటే వంశీ పరిస్థితి ఇబ్బందికరంగా మారి ఉండేదేమో!


