TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇప్పటికింతేనా...?

Published on: Sat Aug 25, 2012 9:04AM

ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రయత్నించినప్పటికీ జాప్యం తప్పలేదని.. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం పునఃప్రారంభ సమయానికి పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు అందజేసేందుకు ఇప్పట్నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రాథమిక విద్యాశాఖా మంత్రి సెలవిచ్చేస్తున్నారు. ప్రతి విద్యా సంవత్సరం పాఠ్ యపుస్తకాలు ఆలస్యంకావడం... దానికి అమాత్యులు స్పందిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ ఇబ్బందులుండ వని చెప్పడం ప్రతిఏడాదీ సహజంగా జరిగేదే! అవేకాకుండా విద్యార్ధులకు పాదరక్షల పంపిణీపై సమాలోచనలు కొనసాగుతున్నాయని.. బూట్లు ఇవ్వాలా, చెప్పులు ఇవ్వాలా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని మంత్రిగారు కాస్త ఆశ కూడా చూపించారు. పుస్తకాల్లేవు మొర్రో అంటూ ఓ పక్క పిల్లలు గోలెడుతుంటే మంత్రిగారు వచ్చే ఏడాది నుంచి పుస్తకాలతో బాటు చెప్పులు, బూట్లూ అంటూ చెప్పుకుపోతున్నారు.. ఇదంతా చూస్తుంటే` గంజికి నూకలు లేవంటే... పాయసంలోకి పంచదారే ఇస్తానన్నాడట... (ఇదో కొత్తసామెతలెండి..) అన్నట్టుగా ఉంది కదూ....