TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రపతి ఎన్నిక: ప్రణబ్ అభ్యర్ద్వత్వానికి మార్గం సుగమం

Published on: Mon Jun 11, 2012 11:00AM

presidential poll, president of india election, next president of india, pranab as next president, congress presidential candidate, mamata support to congress candidate, presidential poll mamata support, pranab mukherjee presidential pollరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి యూపీఏలోని అధిక భాగస్వామ్య పక్షాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో ప్రణబ్ అభ్యర్ద్వత్వానికి మార్గం సుగమం అయినట్లే అని పలువురు భావిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రణబ్ వైపే మొగ్గు చూపుతోంది. ఈమేరకు ఆర్థిక మంత్రికి మద్దతు ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని బెంగాల్ పీసీసీ కోరింది. ఎన్సీపీ మాత్రం ఏకాభిప్రాయం రావాలని కోరుకుంటోంది. యూపీఏ తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా తాను గౌరవిస్తానని ప్రకటించింది. నమ్మకమైన భాగస్వామ్యపార్టీగా తమ వంతు పాత్రను పోషిస్తామని తెలిపింది.