హైదరాబాద్‌కి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
Published on: Sat Aug 2, 2014 3:17PM
.jpg)
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌కి వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వున్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సటీలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ మొదటిసారి హైదరాబాద్‌కి వచ్చారు.


