అవసరమైతే రాష్ట్రపతి పాలన: చాకో

 

 president rule in ap, congress, P. C. Chacko, telangana, samaikyandhra

 

 

రాష్ట్రంలో నెలకొన్న అనిస్చితుల దృష్ట్యా అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో అన్నారు. దీనితో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి హెచ్చరికలు జారీ చేసినట్లు అర్ధమవుతోంది. గత కొద్ది రోజులుగా ముఖ్య మంత్రి సీమాన్ద్రలో జరుగుతున్న సమ్మె నేపధ్యంలో ఉద్యోగుల జె.ఎ.సి ల తో జరుపుతున్న చర్చలు విఫలం అవుతున్న నేపధ్యంలో చాకో ఇలాంటి ప్రకటన చేసి ఉండవచ్చునని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరో పక్క కిరణ్ కుమార్ రెడ్డి తాను ముఖ్య మంత్రి గా ఉన్నంత వరకు ఈ రాష్ట్రం సమైఖ్యం గానే ఉంటుందనే వెల్లడించటం మరింత గందరగోళానికి,సందిగ్ధతలకు దారితీస్తోంది. అయితే చాకో చేస్తున్న వ్యాఖ్యానం నేపధ్యంలో కేబినెట్ నోట్ అసెంబ్లీ తీర్మానం కోసం అసెంబ్లీ కి వస్తుందా,రాదా అనే అనుమానాలు కూడా నెలకొంటున్నాయి.