ముగిసిన ప్రణబ్ శీతాకాల విడిది..
Published on: Thu Dec 31, 2015 10:37AM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది ముగిసింది. 14 రోజుల పాటు బొల్లారంలో తన భవనంలో విడిది చేసిన రాష్ట్రపతి..రాష్ట్ర పర్యటన ముగియడంతో ఈ రోజు ఢిల్లీకి తిరిగి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి వీడ్కోలు తెలిపేందుకు గాను.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. సీఎం కేసీఆర్ ఆయన సతీమణి.. కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్ ఇంకా పలువురు నేతలు వచ్చారు.


