TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ, తృణమూల్ కూల్ కూల్... ప్రణబ్...

Published on: Wed Aug 13, 2014 3:47PM

 

పార్లమెంట్‌లో రూమ్‌ విషయంలో గొడవపడుతున్న తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు శాంతంగా వుండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హితబోధ చేశారు. బుధవారం నాడు పార్లమెంట్‌లో జరిగిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ రెండు పార్టీల ఎంపీలకు సర్దిచెప్పి వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ అంశంలో రెండు పార్టీల ఎంపీలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌కి వున్న గౌరవాన్ని సభ్యులు కాపాడాలని కోరారు. స్వాతంత్ర్య సమరానికి ప్రతీకగా పార్లమెంటు నిలుస్తుందని, తొలిసారి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు మెట్ల మీద శిరస్సు వంచి ప్రణమిల్లడం తన గుండెను తాకిందని రాష్ట్రపతి చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయానికి ఉన్న పవిత్రతకు ఇది నిదర్శనమన్నారు.పార్లమెంటు భవనంలోని గ్రౌండుఫ్లోర్ ఐదో నెంబరు గది కోసం తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు వాదులాడుకున్న విషయం తెలిసిందే.