ఆయన కంటే రాష్ట్రపతి వేతనం ఎందుకు తక్కువ

ఇప్పుడు దేశంలోని అత్యున్నత అధికారుల కంటే ఆ అధికారులందరికీ బాస్ అయిన భారత రాష్ట్రపతి వేతనం చాలా తక్కువట. 7వ వేతన సంఘం సిఫారసు ప్రకారం 2016 జనవరి 1 నుంచి ప్రభుత్వ అధికారుల వేతనాలు పెరిగాయి.. కానీ రాష్టపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల జీతాల్లో మాత్రం ఎటువంటి మార్పులు రాలేదు. చివరికి కేబినెట్ సెక్రటరీ కన్నా రాష్టపతి తక్కువ జీతాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతికి రూ.1.50 లక్షల వేతనం కాగా.. ఉప రాష్ట్రపతికి రూ.1.25 లక్షలు, రాష్ట్ర గవర్నర్లుకు రూ.1.10 లక్షల వేతనాన్ని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తున్నారు. అయితే దీనిపౌ విమర్శలు వస్తుండటంతో రాష్టపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలను పెంచే ముసాయిదాను హోంమంత్రిత్వ శాఖ సిద్ధం చేసి మంత్రిమండలి ఆమోదం కోసం ఏడాది క్రితమే పంపారు. అయితే దీనిపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కొత్త సిఫారసుల ప్రకారం.. రాష్ట్రపతి నెలకు రూ.5 లక్షలు.. ఉప రాష్ట్రపతి రూ.3.5 లక్షలు, గవర్నర్ రూ.3 లక్షల వేతనాన్ని పొందనున్నారు.