అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్
Published on: Mon Jul 22, 2024 12:21AM
అందరూ అనుకున్నట్టే జరిగింది. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. దేశ ప్రయోజనాలతోపాటు డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాల కోసం కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతానని ఆయన వెల్లడించారు. గత కొద్దిరోజులుగా బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వస్తోంది. దానికి తోడు ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్‌ని ఎదుర్కోగల అభ్యర్థిని డెమోక్రటిక్ పార్టీ ఎంపిక చేయాల్సి వుంది.


