TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రేమ కవితలతో వేధించిన శాస్ర్తవేత్త

Published on: Tue Feb 16, 2016 10:11AM

 

 

 

అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన పర్యావరణవేత్త ఆర్‌.కే.పచౌరీ ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కొంటున్నారు. The Energy and Resources Institute (TERI) అనే సంస్థకు డైరక్టరుగా ఉన్న పచౌరీ తన తోటి ఉద్యోగినులను లైంగికంగా వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే నిందితుడు చాలా ప్రముఖుడు కావడంతో ఇప్పటివరకూ అటు అధికారులూ, ఇటు సంస్థ యాజమాన్యం కూడా ఈ ఆరోపణలను తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. కానీ పచౌరీకి పాపం పండినట్లుంది.

 

గత నెల TERI ఆయన పదోన్నతి కల్పించడంతో, పచౌరీకి వ్యతిరేకంగా నిరసన గళాలు వెల్లువెత్తాయి. దాంతో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేయక తప్పలేదు. ఇందులో భాగంగా పచౌరీ మీద లైంగిక ఆరోపణలు చేస్తూ ఒక ఉద్యోగిన దాఖలు చేసిన కేసుకి సంబంధించి 500 పేజీల ఛార్జిషీటును తయారుచేశారట. ఇందులో పచౌరీ ఆమె కోసం ప్రేమను ఒలికిస్తూ పంపిన వేలాది ఫోన్‌ మెసేజిలూ, వాటికి ఆమె తిరస్కరణలూ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రేమ కవితలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఈ ఫిర్యాదు చేసిన ఉద్యోగిన వయసు 29 సంవత్సరాలు కాగా, పచౌరీగారి వయసు 75 ఏళ్లు. పిదపకాలం!