గర్భిణీకి వైద్యం నిరాకరణ, అంబులెన్స్‌లోనే  డెలివరీ బిడ్డ మృతి!

రాజస్తాన్‌లో కొంత మంది వైద్యులు చూపిన మత వివక్షకు ప‌సిపాప బ‌లైంది.  మతం పేరుతో వైద్యం నిరాకరించిన సంఘటన రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రాగా, సిక్రీలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించారు. కేసు క్లిష్టంగా ఉందంటూ అక్కడి వైద్యులు ఆర్‌బిఎం జనన ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. అయితే అక్కడికి వెళ్లగా, డ్యూటీలో వున్న వైద్యురాలు  మహిళ భర్తను వివరాలు అడిగారు. అంతే మేం ఇక్కడ ముస్లింలకు చికిత్స అందించబోమని, జైపూర్‌కు తరలించాలని ఇర్ఫాన్‌తోనూ, అక్కడ ఉన్న మరో డాక్టర్‌తోనూ చెప్పారు. 

వేరే దారిలేక జైపూర్ బ‌య‌లుదేరారు. దారిలోనే  అంబులెన్స్‌లో ఆమెకు డెలివరీ అయిందని ఆమె భ‌ర్త ఇర్ఫాన్‌ తెలిపారు. తమ బిడ్డ చనిపోయా డని భోరున విలపించాడు. ఈ ఘటనపై రాజస్తాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి, భరత్‌ పూర్‌ ఎమ్మెల్యే సుభాష్‌ గార్గ్‌ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటన బాధాకరమైన దని, జిల్లా యంత్రాంగానికి చెందిన బృందం విచారణ చేపడుతుందని సుభాష్‌ గార్గ్‌ తెలిపారు.