ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం...వారికి బహిరంగ క్షమాపణ
Published on: Wed Nov 12, 2025 4:02PM

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను వ్యవహరించిన తీరుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌కు ఆయన బహిరంగ క్షమాపణలు కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు.
గత ప్రభుత్వంలో సర్వీసులో ఉండగా వారి పట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు ఇప్పుడు చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను బాధపెట్టిన అధికారులకు క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన చర్యల వల్ల ఇబ్బందిపడిన ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిశోర్‌ను మన్నించామని కోరారు.


