ఉద్యోగుల విభజన: భార్యాభర్తలపై చర్చే లేదు...

 

ప్రత్యూష్ సిన్హా కమిటీ ఢిల్లీలో సమావేశమై ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీకి సంబంధించిన అభ్యంతరాల మీద చర్చించింది. ఈ సమావేశంలో భార్యాభర్తలైన అధికారుల విషయంలో ఏంచేయాలన్న అంశం చర్చకు రాలేదు. మరోసారి డీవోపీటీతో కమిటీ సమావేశం అయ్యే అవకాశముంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల సీఎస్‌లు హాజరయ్యారు. ఇదిలా వుంటే ముసాయిదాలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన యాభై మంది అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీపై స్పష్టత రాకపోవడంతో సమావేశం ఇంకోసారి వాయిదా పడింది. మరో సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.