బంకీపూర్ ఉప ఎన్నికలో పీకే విజయం.!
Published on: Mon Aug 3, 2026 6:04PM

బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గం నుంచి పీకే సాధించిన ఈ విజయం బీహార్ రాజకీయాలలో సంచలనంగా మారింది. పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇటీవల నితిన్ నబీన్ ను బీజేపీ రాజ్యసభకు పంపడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా విజయం సాధించి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు.
Prashantkumar win bamkipur by poll, election, Straregist, Shock, BJP


