సైనికుల భార్యలపై ఎమ్మెల్సీ అసభ్య వ్యాఖ్యలు..
Published on: Thu Mar 9, 2017 3:00PM

రాజకీయ నాయకులు అప్పుడప్పుడు నోరు జారడం.. ఆ తరువాత విమర్శల పాలవడం కామన్. ఇప్పుడు ఈ ఖాతాలో మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్సీ ప్రశాంత్ పరిచారక్ చేరిపోయారు. ఈయన ఆర్మీ సైనికుల భార్యలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఆఖరికి పదవి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు సంగతేంటంటే...స్థానిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గత నెల పరిచారక్ ప్రసంగిస్తూ సైనికుల భార్యలపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఏడాది పొడుగుతా ఇంటికి రాకపోయినా.. తమ భార్యలకు పిల్లలు పుట్టగానే సైనికులు సరిహద్దుల్లో స్వీట్లు పంచుతారని వ్యాఖ్యానించారు. ఇంకేముంది ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన సహా ప్రతిపక్షాలు ఆయనపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనను మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదిన్నరపాటు శాసనమండలి నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.


