TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రాణహితకు జాతీయ హోదాకోసం టీడీపీ ఆందోళన

Published on: Wed Jan 25, 2012 2:22PM

హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ టిడిపి తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో  నిరసన చేపట్టారు. బుధవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి నల్ల గుడ్డ కప్పి వారు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం చిరంజీవి గుర్రమెక్కితే ప్రాణహిత ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రజలు గాడిదనెక్కిస్తారన్నారు. ఒక రాష్ట్రానికి ఒకే ప్రాజెక్టు అనే మాట అయితే మా తెలంగాణ రాష్ట్రం మాకు ఇచ్చేయండని డిమాండ్ చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ప్రాణహిత గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు జాతీయ హోదాపై చేవెళ్ల చెల్లెమ్మ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. జలయజ్ఞంలో భారీగా కుంభకోణం జరిగిందన్నారు.