తెలంగాణలో మరోసారి చంద్రబాబు యాత్రకు కసరత్తు
Published on: Wed Jan 25, 2012 9:52AM
హైద
రాబాద్: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సైకిల్ యాత్ర చేపట్టబోతున్నారు. చంద్రబాబు సైకిల్ యాత్ర చేయనున్నట్లు పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు వెల్లడించారు. చంద్రబాబు సైకిల్ యాత్ర చేయనున్నట్లు తెలియడంతో ప్రాణహిత కోసం తలపెట్టిన పాదయాత్రను టి-టిడిపి ఫోరం వాయిదా వేసిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రైతు పోరు బాట పేరుతో చంద్రబాబు జిల్లాల్లో పర్యటించారు. బడ్జెట్ సమావేశాల తర్వాత మరోసారి ఆయన తెలంగాణ ప్రాంతంలో పర్యటించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు రైతు సమస్యలపై పర్యటించిన చంద్రబాబు ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక సమస్యలపై ఉద్యమించనున్నట్లు తెలుస్తోంది. అందుకు నాందిగా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెకుక్టు జాతీయ హోదా కల్పించాలని, దాని నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సైకిల్ యాత్ర చేయను న్నట్లు తెలిసింది. బాబు యాత్రపై టి-టిడిపి ఫోరం నేతలు కార్యచరణ ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని వైఎస్ సర్కారు చేసిన వాగ్దానం అమలు చేయలేదని, కనీసం పనులు ప్రారంభించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఫోరం ఆధ్వర్యంలో యాత్ర చేయడం కంటే చంద్రబాబు సైకిల్ యాత్ర చేయడమే ఉపయోకరంగా ఉంటుందని పార్టీ భావిస్తోంది.


