ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం ఉందా? లేదా?

 

ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ మాజీ రాష్ట్రపతి.. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, మాజీ రాష్ట్రపతితో పాటు, మాజీ కాంగ్రెస్ నేత కూడా అనాల్సి వచ్చేలా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. కాంగ్రెస్ నేతలు వద్దని చెప్పినా వినకుండా.. ప్రణబ్, ఈ మధ్య జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే.. సిద్ధాంత పరంగా శత్రువైన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరవ్వడంతో..కాంగ్రెస్ పార్టీ, ప్రణబ్ మీద కోపంగా ఉంది.. అందుకే ప్రణబ్ ని కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.. దానిలో భాగంగానే.. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానం, ప్రముఖులు అందరికీ పంపారు కానీ ప్రణబ్ కి పంపలేదంటూ వార్తలొచ్చాయి.. అయితే ఈ వార్తలని కాంగ్రెస్ కొట్టి పారేస్తోంది.. ప్రణబ్ ముఖర్జీ కి ఆహ్వానం పంపామని, ఆయన కూడా విందుకి రావడానికి అంగీకరించారని కాంగ్రెస్ అంటుంది..

దీంతో ప్రణబ్ కి నిజంగా ఆహ్వానం పంపారా? ఒకవేళ పంపినా ప్రణబ్ విందుకి వస్తారా? అంటూ ప్రజలలో ప్రశ్నలు మొదలయ్యాయి.. ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.. మొత్తానికి రేపు ఇఫ్తార్ విందు సాక్షిగా తెలియనుంది.. కాంగ్రెస్, ప్రణబ్ ని పక్కన పెడుతుందో? లేక ప్రస్తుతానికి తమ పక్కనే ఉంచుకుంటుందో?.. అయితే ఇదంతా చూసి.. కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం.. ప్రణబ్ ని కాంగ్రెస్ రాష్ట్రపతి చేసి గౌరవం ఇచ్చింది.. కానీ ప్రణబ్ కి మొదటి నుండి ప్రధాన మంత్రి పదవి మీద మక్కువ ఉండేది.. అందుకే కొన్ని పార్టీలు ప్రణబ్ తో థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేయించాలని చూస్తున్నాయి.. ఇది తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రణబ్ ని దూరం పెడితే కాంగ్రెస్ కే నష్టం అంటున్నారు.. చూద్దాం ఈ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ఏంటో?.