TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీటింగ్‌లో తేల్చుకుంటాను- ప్రణబ్‌ ముఖర్జీ

Published on: Mon Jun 4, 2018 1:18PM

 

హిందూ సంస్థ ఆరెస్సెస్ తమ సమావేశానికి హాజరు కావాలంటూ కాంగ్రెస్‌ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించిన విషయం తెలిసిందే! ఎవరూ ఊహించని విధంగా ప్రణబ్‌ దా ఆ ఆహ్వానాన్ని మన్నించేశారు. ఇహ అప్పటి నుంచి తర్జనభర్జనలు మొదలవుతున్నాయి. ఈ సమావేశానికి హాజరు కావద్దంటూ కాంగ్రెస్ పోరుతుటే, వస్తే తప్పేంటని ఆరెస్సెస్ ప్రశ్నిస్తోంది. ప్రణబ్‌ మాత్రం ఇవేమీ పట్టకుండా ఉన్నారు. అందరి సమాధానాలకూ తాను మీటింగ్‌లోనే బదులు చెబుతానని అంటున్నారు. బహుశా ప్రణబ్ సమావేశ వేదిక మీద ఆరెస్సెస్‌కు దులిపిపారేస్తారని అనుకుంటున్నారు. మరికొందరేమో ఆయన కాంగ్రెస్‌కు రాం రాం చెప్పి ప్రతిపక్షాల పంచన చేరేందుకు ఈ అవకాశాన్ని వాడుకుంటారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలంటే 7వ తేదీ వరకూ ఆగాల్సిందే!