TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికల ప్రక్రియ ముగిసాకే బడ్జెట్ ప్రణబ్

Published on: Mon Jan 2, 2012 4:20PM

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తరువాతే 2012-13 కేంద్ర బడ్జెట్ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రభుత్వం ఇంకా దీనిపై ఆఖరి తేదీని నిర్ణయించుకోలేదని ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. బడ్జెట్ సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి రోజు ఉంది. కానీ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 30 నుండి మార్చి 3వ తేదీల మధ్య ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని మార్చి 4వ తేదీ ఓట్లు లెక్కింపు ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జనవరి 11 నుండి వార్షిక బడ్జెట్‌ సమావేశాలు వివిధ భాగస్వాములతో ఉంటుందని వివరించారు. ఈ 2012-13 బడ్జెట్ సమావేశంలో మొదట వ్యవసాయదారులతో తరువాత పది రోజులు ఆర్థికవేత్తలు, ప్రతినిధులు మరియు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకొంటామని వివరించారు. ఈ అభిప్రాయాల సేకరణతో పాటు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బడ్జెట్ ఉంటుందని ప్రణబ్ తెలిపారు.