TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాధారణ బడ్జెట్ విశేషాలు

Published on: Fri Mar 16, 2012 11:45AM

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెడుతున్న సాధారణ బడ్జెట్ విశేషాలు

యూరప్ సంక్షోభం, మధ్యప్రాచ్య రాజకీయ పరిస్థితులు భారత్పై ప్రభావం
వృద్ధిరేటు తగ్గుదల తీవ్ర ప్రభావం
2011-12లో వృద్ధిరేటు 6.9 శాతం
2011-12 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు నిరాశాజనకం
ఆర్థిక పునరుజ్జీవనానికి అయిదు సూత్రాల ప్రణాళిక
వ్యవసాయం, సేవల రంగం మెరుగు
తయారీ రంగం పురోగతివైపు పయనం
సంస్కరణలు వేగవంతం చేయాలి
దేశీయ అవసరాలు తీర్చేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం వైపు దృష్టి
ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణలో రాష్ట్రాల సహకారం గణనీయం
2012-13 సంవత్సరానికి వృద్ధిరేటు 7.6 శాతంగా అంచనా
వ్యవసాయం, సేవల రంగాలు మెరుగ్గా ఉన్నాయి
ముడిచమురు కొనుగోళ్లకు గణనీయంగా వ్యయం
ఆరు నెల్లలో కిరోసిన్, ఎల్పీజీ, సబ్సీడీలు నేరుగా లబ్ధిదారులకు అందేలా పైలట్ పథకం
ఎగుమతులు, దిగుమతుల మార్కెట్ల విస్తరణలో విజయం
నందన్ నీలేకని కమిటీ సిఫార్సులు పరిగణనలోకి తీసుకోవటం
వ్యవసాయం, అనుబంధ రంగాలు 2.5 శాతం వృద్ధి సాధించే అవకాశం
ఆసియా దేశాల ఎగుమతులు 33 శాతం నుంచి 50 శాతానికి పెరుగుదల
తొలి త్రైమాసికంలో 23 శాతం ఎగుమతులు పెరుగుదల
ప్రజాజీవితంలో నల్లధనం, అవినీతి లేకుండా చేయటం
సంస్కరణలు వేగవంతం చేయాల్సిన అవసరం
రాయితీల బదిలీకి నందన్ నీలేకన్ ఇచ్చిన సిఫార్సులు ఆమోదం
వచ్చే ఆరు నెలల్లో 50 జిల్లాల్లో పైలట్ పథకం
రాబోయే మూడేళ్లలో జీడీపీలో సబ్సడీని రెండు శాతం నుంచి 1.7 శాతం తగ్గింపు
రానున్న రెండేళ్లలో ఆహార భద్రత బిల్లు పూర్తి స్థాయిలో అమలు
బడ్జెట్లో భాగంగానే ఎఫ్ఆర్బీఎమ్ సంస్కరణలు
ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగింపు
త్వరలో ప్రత్యక్ష పన్నుల కోడ్ బిల్లు
నాబార్డు, ఇతర బ్యాంకులకు రూ.15,888 కోట్లు కేటాయింపు
నాబార్డు, ఇతర వ్యవసాయ బ్యాంకులకు రూ.15,888 కోట్లు కేటాయింపు
రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశం
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో నెస్ట్ పద్ధతి విజయవంతం
పదికోట్లకు పైబడిన ఐపీవో విడుదల, ఇకపై ఎలక్ట్రానిక్ ఫార్మాట్ తప్పనిసరి
ఇకపై ఐపీవో ప్రక్రియ సరళతరం
పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం రూ.50 కోట్లు కేటాయింపు
గ్యాస్ పైలెట్ ప్రాజెక్ట్ మైసూర్లో నడుస్తోంది
పబ్లిక్ బ్యాంకుల మూలధన అవసరాలకు ప్రత్యే సంస్థ ఏర్పాటుకు పరిశీలన
రక్షణ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు
మల్టీబ్రాండ్ రీటెయిలింగ్లో 51 శాతం ఎఫ్డీఐలకు ఏకాభిప్రాయం
జాతీయ రహదారుల సంస్థకు రూ.10వేల కోట్లు సమకూర్చటం