TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రకాష్‌రాజ్‌ కారుకు ప్రమాదం...

Published on: Tue Aug 12, 2014 10:25PM

 

ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ కారుకు హైదరాబాద్‌లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రకాష్‌రాజ్ తన కారులో ప్రయాణిస్తూ వుండగా ఆయన కారును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాష్ రాజ్ కారు ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తూ ప్రకాష్ రాజ్‌కు ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తెలుగులో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ‘‘ఈ ప్రమాదం సందర్భంగా నేను షాక్‌కి గురయ్యాను. బస్సు నా కారును ఢీకొన్న సంఘటన కంటే, ఈ సందర్భంగా కొంతమంది జనం ప్రవర్తించిన తీరు నన్ను షాక్‌కి గురిచేసింది. ఆర్టీసీ బస్సు నా కారుతోపాటు ఒక ఆటోని కూడా ఢీకొంది. అక్కడ గుమికూడిన కొంతమంది యువకులు ఆటోలో వున్నవారిని కాపాడే విషయాన్ని పక్కన పెట్టేసి, సెల్ ఫోన్‌లతో నన్ను ఫొటోలు తీయడంలో నిమగ్నమయ్యారు. ఇలాంటి బాధ్యతారాహిత్యంతో వున్న యువతరాన్ని చూసి నేను నిజంగా షాక్‌కి గురయ్యాను’’ అన్నారు.