ప్రకాష్‌రాజ్ కారు యాక్సిడెంట్.. బస్సు డ్రైవర్ అరెస్టు
Published on: Wed Aug 13, 2014 10:40PM
.gif)
సినీ నటుడు ప్రకాష్‌రాజ్ కారును మంగళవారం రాత్రి బస్సు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ప్రకాష్ రాజ్ కారు ధ్వంసమైంది. ప్రకాష్ రాజ్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక చిన్నారికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ప్రకాష్ రాజ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ని విచారిస్తున్నట్టు మాదాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


