నన్ను రెచ్చగొట్టొద్దు..రాజకీయాల్లోకి వస్తా..

 

ఈ మధ్య బీజేపీ ప్రభుత్వంపై తరచూ ఏదో ఒక విమర్శలు గుప్పిస్తూ.. విలక్షణ నటుడు ప్రకాష్ రాశ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సూపర్ స్టార్ రజనీ కాంత్, కమల్ హాసన్ మాదిరి ప్రకాశ్ రాజ్ కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదైనా ఉందా అని అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి రాజకీయాలపై స్పందించిన ప్రకాశ్ రాజ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరులో ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూరు నుంచి 2017 సంవత్సరానికి గాను ''ఉత్తమ వ్యక్తి'' అవార్డు అందుకున్నతరువాత మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రాజ్... రాజకీయాలంటే తనకు ఏమాత్రం ఆసక్తి లేదని.. అవి చాలా కష్టమని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కానీ ఊరకే రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లో వస్తానని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించాడు. బెంగళూరును బెందకాళూరు అని కూడా పిలుస్తారని, శాంతికి భంగం కలిగించి అశాంతి సృష్టించాలనుకునే వారి వ్యాఖ్యలు ఇక్కడ సాగవని హెచ్చరించారు. బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య తర్వాత రాజకీయాలపై కడిగేయడం మొదలెట్టిన ప్రకాశ్ రాజ్.. అప్పటినుండి బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.