TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధికారుల వివరణ శుద్ధ అబద్ధం: ఓటు తొలగింపుపై ప్రకాశ్ రాజ్!

Published on: Fri Aug 14, 2026 8:39AM

తన ఓటు తొలగింపు విషయంలో ప్రకాష్ రాజ్ మరో సారి ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు.     ఓటర్ల జాబితా నుంచి తన పేరును  తొలగించారని ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన ప్రకాశ్ రాజ్.. ఆ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ శుద్ధ అబద్ధమని మరో సారి ఈసీ తీరును తప్పుపట్డారు.    ఆ వివరణ ఓటర్లను, ప్రజలను మభ్యపెట్టే డ్రామా అని ఆరోపించారు. ఈ మేరకు గురువారం (ఆగస్టు 23)  ఓ వీడియో  విడుదల 

ఇటీవల చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ  సర్ లో భాగంగా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఓటరు జాబితా నుంచి తన ఓటు హక్కు గల్లంతైందని ప్రకాశ్ రాజ్ విడుదల చేసిన వీడియోలో ఆరోపించిన సంగతి తెలిసిందే.  తాను పుట్టి పెరిగిన చోట, చిన్నతనం నుంచి చదువుకున్న ప్రాంతంలో,  2019 పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన స్థానంలోనే తన ఓటు పేరు లేకుండా పోవడంపై ప్రకాష్ రాజ్ ఆ వీడియోలో..  ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ కారణంగా తన ఒక్కడి ఓటే కాదు.. బెంగళూరు వ్యాప్తంగా  65 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని ఆధారాలతో సహా ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. 

దీనిపై స్పందించిన  ఎన్నికల అధికారులు, ప్రకాశ్ రాజ్ ఓటును   తొలగించలేదనీ, ఆయన ఓటు నమోదై ఉన్న   విఠల్ మాల్యా రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో ప్రకాష్ రాజ్ గత నాలుగేళ్లుగా నివసించడం లేదని   విచారణలో తేలిందనీ,  భవన యజమాని, చుట్టుపక్కల నివాసితులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడంతో, జాబితాలో కేవలం  నివాసం మారారు"  అని మాత్రమే నమోదు చేశామని వివరణ ఇచ్చారు. ఫోన్ సంభాషణలో ప్రకాశ్ రాజ్ కూడా తాను వేరే ప్రాంతానికి మారినట్లు అంగీకరించారనీ..  ఫారం 6 దాఖలు చేసి కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

అయితే అధికారుల స్పందనను ఖండిస్తూ ప్రకాష్ రాజ్ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. . అధికారులు   కట్టుకథలు చెబుతున్నారని పేర్కొన్నారు. తాను ఓటు తొలగింపుపై చెప్పిన వెంటనే.. అధికారులు పొరపాటు జరిగిందనీ,  త్వరలోనే సరిచేస్తామని  చెప్పి.. ఆ తర్వాత వివాదం ముదరడంతో మాట మార్చారని ఆరోపించారు. మాట మార్చారని ధ్వజమెత్తారు. శాశ్వతంగా మారారు"  అనే పదాన్ని రాత్రికి రాత్రే షిప్టెడ్  అని సరిదిద్ది..    తనిఖీ డ్రామా ఆడారని విమర్శించారు. ఓటు తొలగింపు అన్నది కేవలం ప్రకాశ్ రాజ్   వ్యక్తిగత సమస్య కాదని, సామాన్య పౌరుల ప్రాథమిక ఓటు హక్కు పరిరక్షణ కోసం తాను చేస్తున్న  పోరాటమన్నారు. ఓటు తొలగింపు కుట్రకు సంబంధించి మరిన్ని ఆధారాలతో త్వరలోనే  ప్రజల ముందుకు వస్తానని ప్రకాష్ రాజ్ తన తాజా వీడియోలో పేర్కొన్నారు.  

Prakash Raj, Votecontroversy, Bengaluru voter list, Prakash Raj new video, Karnataka Election Commission, BBMP voter revision