ఏపీలో మరో బస్సు ప్రమాదం..30 మంది విద్యార్థులకు గాయాలు
Published on: Thu Mar 2, 2017 9:15AM
.jpg)
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 11 మంది మరణించిన ఘటన మరచిపోకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం అలవలపాడు వద్ద కల్వర్టును ఢీకొని పాలేరు బ్రిడ్జిపై నుంచి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్ధులు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు ఉలవపాడు మండలం కరేడు ఉన్నత పాఠశాలకు చెందిన వారు.


