TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రకాశం బ్యారేజ్.. అదరహో!

Published on: Thu Aug 8, 2024 11:30AM

ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీ స్థాయిలో చేరింది. ఆ నీటిని చూస్తుంటే కడుపు నిండిపోతోంది. ఇదే మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బుధవారం ప్రకాశం బ్యారేజ్‌ని సందర్శించిన సందర్భంగా అన్నారు. విజయవాడలో వున్న ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. దాంతో వరదనీరు బ్యారేజీకిలో భారీగా చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ‌లో ‌ 2,88,191 క్యూసెక్కుల నీరు వుంది. కాలువలకు ‌13,991 క్యూసెక్కుల నీటిని విడుదల అవుతోంది. వరద నీరు అధికంగా ఉండటంతో బ్యారేజీ 30 గేట్లు 7 అడుగుల మేర, 40 గేట్లు 6అడుగుల మేర ఎత్తి 2,74,200 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాలలో వుండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.