TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం...69 గేట్ల ఎత్తి నీటి విడుదల

Published on: Thu Aug 28, 2025 3:07PM

 

ప్రకాశం బ్యారేజీకి వద్ద భారీగా వరద వచ్చి చేరుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి బ్యారేజీలోకి  4.3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 69 గేట్ల ద్వారా 3.93 లక్షల క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగే ప్రమాదం ఉంటంతో కృష్ణ పరీహక ప్రాంత ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పులిచింతల నుంచి వస్తున్న నీరు మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక పొలాలలోకి వెళ్లవద్దని ఇప్పటికే సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు.

జిల్లా యంత్రాంగం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3,10,546 క్యూసెక్కులు చేరుతోంది.