TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గవర్నర్ అధికారాలపై పిటిషన్ కొట్టివేత

Published on: Thu Aug 14, 2014 5:53PM

 

హైదరాబాద్‌పై గవర్నర్ అధికారాలను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాలు గవర్నర్కు అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు దానిని కొట్టివేసింది. అయితే దానిని ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా దాఖలు చేయాలని కోర్టు పిటిషనర్‌కు సూచించింది.