విద్యుత్తు కోతలు తెలంగాణాలో తప్ప సీమాంధ్రలో లేవట
Published on: Tue Apr 10, 2012 3:54PM
విద్యుత్తు కోతలు తెలంగాణాలో తప్ప సీమాంధ్రలో లేవట
పోచారం గోబెల్స్ ప్రచారం
పచ్చి అబద్ధాలు, అర్థసత్యాలపై నిర్మించిన తెలంగాణా ఉద్యమం వల్ల రాష్ట్రానికి ఇప్పటికే ఎంతో నష్టం జరిగింది. అయినా తెలంగాణా నేతల వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. దీనికి తాజా ఉదాహరణ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రకటనలే. తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలంగాణాకు జైకొట్టిన శ్రీనివాసరెడ్డి తరువాత టి.ఆర్.ఎస్.లో చెరి ఉపఎన్నికల్లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పచ్చి అవకాశవాద రాజకీయాలకు మారుపేరుగా ఉన్న శ్రీనివాసరెడ్డి పచ్చి అబద్దాలకోరుగా కూడా ఘనతికెక్కారు. రాష్ట్రప్రభుత్వం తెలంగాణా ప్రజల పట్ల ఇంకా వివక్షత చూపుతూనే ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క తెలంగాణా ప్రాంతంలోనే విద్యుత్తు కోతలు ఉంటున్నాయనీ, సీమాంధ్రలో అసలు విద్యుత్తు కోతలే లేవనీ ఆయన ప్రచారం చేస్తున్నారు.
ఒకవైపు గోదావరి, కృష్ణానదులు ఎండిపోయి సీమాంధ్రలో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటుంటే, మరోవైపు ఈ ప్రాంతంలో సాగుజలాలను ప్రభుత్వం పుష్కలంగా విడుదల చేస్తూ తెలంగాణాకు అన్యాయం చేస్తోందని పోచారం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అమాయక తెలంగాణా ప్రజలు ఇటువంటి నాయకుల మాయదారి మాటలు విని ఇప్పటికే అపారంగా నష్టపోయారు. ప్రజలు నష్టపోతున్నప్పటికీ పోచారం లాంటి నాయకులు తమ శైలిని మార్చుకోకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూనే వున్నారు.


