అనంతకు ఏమైనా చేస్తే.. నా జీవితం ధన్యమే

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గాను జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ చేస్తోన్న చలోరే చలోరే చల్ యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. దీనిలో భాగంగా కదిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమైన పవన్ .. ప్రకృతి అనుకూలంగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి సమస్యలను పరిష్కరించాలన్నారు. మనిషి తలుచుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు. కరువు కోరల్లో చిక్కుకుని.. వెనుకబడిన అనంతపురం జిల్లాకు ఏమైనా చేయగలిగితే తన జన్మ ధన్యమన్నారు.