TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కత్తి మహేశ్‌ వెనుక ఎవరున్నారు..?

Published on: Sat Sep 9, 2017 11:41AM

బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ సినీ క్రిటిక్ మహేశ్ కత్తి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చిరు జల్లుగా మారిన వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఒక ఇంటర్వ్యూలో పవన్ పాలిటిక్స్ గురించి మాట్లాడిన మహేశ్..ఎలాంటి అజెండా లేకుండా కేవలం ట్వీట్స్ మాత్రమే చేస్తూ..వచ్చే ఎన్నికల్లో పవన్ ఎలా పోటీ చేస్తారు అన్నాడు..అక్కడితో ఆగకుండా ఆయన రాసిన ఇజం పుస్తకం చదివిన వారికి ఎవరికైనా పవన్ తీరు ఏంటా అనే అనుమానాలు వస్తాయని..ఐదవ తరగతి విద్యార్థికంటే హీనంగా ఆ పుస్తకం రాసి కళ్యాణ్ జనాల్ని తికమక పెట్టారంటూ వ్యాఖ్యానించడంతో పవర్‌స్టార్ అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

 

సోషల్ మీడియా వేదికగా కత్తి మహేశ్‌పై విరుచుకుపడుతున్నారు..అంతేనా.. ఒక ఛానెల్‌లో చర్చకు వచ్చిన ఆయనను బయట కనిపిస్తే చంపేస్తామంటూ వార్నింగులు కూడా ఇచ్చారు. కానీ వాటికి అదరకుండా..బెదరకుండా కౌంటర్లు ఇస్తున్నాడు మహేశ్. సరే ఆ సంగతి పక్కనబెడితే నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియని ఓ వ్యక్తి మహేశ్ కత్తి..మరి పవన్ కళ్యాణ్..కోట్లాది మంది అభిమానులు ఆరాధించే నటుడు, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఏకంగా దేశ ప్రధానికి బాగా కావాల్సిన వ్యక్తి.. మరి అలాంటి వ్యక్తి జోలికి వెళ్లాలంటే మహమహులు సైతం వెనుకంజ వేస్తారు..మరి ఏ ధైర్యంతో..ఎవరి అండ చూసుకుని మహేశ్ కత్తి ఇంత దూకుడుగా వెళుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

 

ఈ నేపథ్యంలో ఒక వార్త తెలుగు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే వచ్చే ఎన్నికల నాటికి పవన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి వైసీపీ అధినేత జగనే ఈ డ్రామాను నడిపిస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేనాని టీడీపీకి సపోర్ట్ చేయడం వైసీపీని కోలుకోలేని దెబ్బ తీసి అధికారానికి దూరం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ జంట మళ్లీ కలిస్తే తనకు..తన పార్టీకి ప్రమాదమని గ్రహించిన జగన్..పవర్‌స్టార్ ఇమేజ్‌ను డ్యామేజీ చేయాలని డిసైడయ్యారట..దీనిలో భాగంగానే మహేశ్ కత్తి ద్వారా తన ప్లాన్ వర్కవుట్ చేయిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో..2014 ఎన్నికల్లో మీరు వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు కదా అని చెప్పడంతో "కత్తికి ఫ్యాన్‌"తో గల అనుబంధానికి బలం చేకూరుస్తోంది. అయితే ఇంతవరకు లోటస్‌పాండ్ వర్గాలు కానీ..మహేశ్ కత్తి గానీ ఈ పుకార్లను ఖండించకపోవడం గమనార్హం. మరి ఈ పుకార్లలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.